Friday, December 20, 2024

భారీ బాంబు దాడులు

- Advertisement -
- Advertisement -

Russian forces are cracking down on Ukraine with bombings

ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యన్ సేనలు
నావాసాలపైనా అగ్నివర్షం 18మంది దుర్మరణం, మృతుల్లో
ఇద్దరు చిన్నారులు చెర్నిహివ్‌లో పేలని బాంబు, తప్పిన భారీ
ముప్పు 3లక్షల మందిని బందీలుగా చేసుకున్నారని ఆరోపణ

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు దాడులను కూడా మరింత ఉధృతం చేస్తున్నాయి. క్షిపణులతో జనావాసాలనూ లక్షంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా సోమవారం రాత్రి సుమీ ప్రాంతంలో సిడెన్షియల్ భవనాలపై రష్యన్ బలగాలు జరిపిన 500కిలోల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. మానవత్వాన్ని మంటగలుపుతూ జనావాసాలపై రష్యా సుమీ నగరంలో 500 కేజీల బాంబుతో దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమెట్రో కులేబా ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రాత్రి పూట దాడులు చేస్తోందన్నారు.

రష్యా సైన్యం చెర్నిహివ్ ప్రాంతంలోని జనావాసాలపైకి మరో 500 కిలోల బాంబు దాడికి పాల్పడిందని విమర్శించారు. అయితే ఆ బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యా బలగాలు విచ్చక్షణరహితంగా బాంబు దాడులు చేస్తూ మహిళలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో తమ దేశాన్ని రష్యా దాడుల నుంచి కాపాడాలని ఆయన ప్రపంచ దేశాలను అభ్‌యర్థించారు. కాగా, రష్యా సరిహద్దులోని సుమీ, ఓఖ్టిర్కాలో బాంబు దాడుల కారణంగా నివాస భవనాలు, పవర్ ప్లాంట్ ధ్వంసమైనట్టు ప్రాంతీయ నాయకుడు డిమిట్రో జివిట్స్కీ తెలిపారు. మరోవైపు మరియపోల్‌లో రష్యా బలగాలు మూడు లక్షల మందిని బందీలుగా చేసుకున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో పుతిన్ దండయాత్ర ఆగదని, ఆయన ఎప్పటికీ సంతృప్తి చెందని ఒక మృగం అని మండిపడ్డారు.

రష్యాకు చెందిన మరో మేజర్ జనరల్ హతం

రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఆ దేశానికి చెందిన మరో మేజర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఖార్కివ్‌లో జరిగిన పోరాటంలో రష్యా టాప్ కమాండర్ విటాలీ గెరాసిమోవ్ హతమైనట్లు ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. దీంతో వారం రోజుల్లోనే రష్యన్ ఆర్మీ ఇద్దరు మేజర్ జనరల్ అధికారులను కోల్పయినట్లయింది. 41వ ఆర్మీ దళానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా విటాలీ గెరాసిమోవ్ ఉన్నారు. ఖార్కివ్‌లో జ్రిగిన దాడిలో విటాలీతో పాటు మరికొంత మంది సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. విటాలీ మృతి గురించి ఇద్దరు రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడుకుంటున్న ఓ ఆడియోను కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది.

కీవ్‌ను చుట్టుముట్టిన రష్యా సేనలు

ఓ వైపు ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాలకు సురక్షిత మార్గం ఏర్పాటు కాల్పుల విరమణకు ముందుకు వచ్చిన రష్యా మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేందుకు మరింత ముందుకు వచ్చింది. ఉత్తరదిశ నుంచి పశ్చిమ తూర్పు ప్రాంతాల నుంచి అన్ని విధాలుగా కీవ్‌ను దిగ్బంధం చేసేందుకు రష్య సేనలు కదులుతున్నాయి. ఇది తమకు కీలక తుది మజిలీ అవుతుందని రష్యా అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 1.50లక్షలకు పైగా పుతిన్ సేనలు కీవ్ సమీపంలోకి చేరుకుంటున్నాయని అమెరికా కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ భూభాగం మొత్తాన్ని రష్యా సేనలు పూర్తిగా చేరుకున్నాయని వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News