Sunday, December 22, 2024

రష్యా బలగాలు ఉగ్రవాదులకు భిన్నంగా ఏమీ లేవు: జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్ : దాదాపు నెలన్నర పాటు తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా బలగాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉగ్రదాడులతో పోల్చారు. రష్యా దండయాత్ర తరువాత తొలిసారి ఆయన మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ప్రసంగించారు. రష్యా బలగాలు, ఇతర ఉగ్రదాడులకు భిన్నంగా ఏమీ లేవంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ లోని బుచ్చాలో చనిపోయిన పౌరుల చిత్రాలను చూడటం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అన్నారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై మంగళవారం ప్రారంభమైన ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి తొలుత ఆయన ప్రసంగించారు. రష్యా చేసిన ఇతర యుద్ధనేరాలకు సంబంధించిన సాక్షాధారాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంపై మాట్లాడడం కూడా తన విధి అని చెప్పారు. దాదాపు 74 అభివృద్ది చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇది రక్షణ వాదానికి సమయం కాదని , ప్రజలను రక్షించేందుకు చేయగలిగినదంతా చేయాలని కౌన్సిల్ సభ్య దేశాలను కోరారు.

ఉక్రెయిన్‌కు చెక్ రిపబ్లిక్ నుంచి యుద్ధ ట్యాంకులు

రష్యా బలగాలను ఎదుర్కోడానికి ఉక్రెయిన్‌కు యుద్ద ట్యాంకులను పంపనున్నట్టు చెక్ రిపబ్లిక్ రక్షణ మంత్రి జానా సెర్నొచోవా తెలిపారు. అంతకు ముందు చెక్ రిపబ్లిక్ లోని గూడ్స్ రైళ్లపై టీ 72 యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను లోడ్ చేసి ఉంచిన దశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ క్రమం లోనే ఉక్రెయిన్‌కు సైనిక సామగ్రిని పంపుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News