మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. తొలిరోజు రష్యా దాడుల్లో మొత్తం 137 మంది మృతిచెందారు. సైనికులు, ప్రజలు 137 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. వందలాదది మంది గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రశాంత నగరాలపై రష్యా విరుచుకుపడిందని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ పై మెరుపు దాడులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో భీకర దాడికి దిగింది. ఉక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులు జరుపుతోంది. 83 స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. కానీ రాష్యా మొత్తం 203 దాడులు చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైన్యం బాంబులు దాడి చేసింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కైవ్ మీదుగా శత్రు విమానాన్ని కూల్చివేశాయి. కీవ్ నగరంలో విమాన శకలాలు పడి భారీ అపార్ట్ మెంట్ ధ్వంసం అయింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా బలగాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -