- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ లో యుద్ధ విమానాల బీభత్సం కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి ప్రవేశించాయి. కీవ్ నగరంపై కన్నేసిన రష్యా అనుకున్నట్టే నలువైపుల నుంచి దాడి చేసి నగరంలోకి చేరింది. కీవ్ లో ఎయిర్ రెయిడ్ సైరన్లు నిరంతరాయంగా మోగుతున్నాయి. కీవ్ గగనతలంలో 2 క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్ కూల్చేసింది. క్షిపణులు, విమానం కూల్చినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడించారు. ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ ద్వీపాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కీవ్ ప్రభుత్వ క్వార్టర్స్ పై రష్యా సైన్యం కాల్పులు జరిపింది. దీంతో కీవ్ తో పాటు సమీప ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు
- Advertisement -