కీవ్: ఉక్రెయిన్ లో రష్యా దాడులు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ సమీపంలో ఇరు దేశాల సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుపుతున్నాయి. సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులు జరుపుతోంది. రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యాలు అడ్డుకుంటున్నాయి. యుద్ధంలో 198 మంది మృతిచెందగా, వెయ్యికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. 975 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. 471 మంది ఉక్రెనియన్లను అదుపులోకి తీసుకున్నట్టు రష్యా బలగాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్ లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. ఖర్కివ్ లో గ్యాస్ పైప్ లైన్ ను పేల్చేసినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. జులియానీ ఎయిర్ పోర్టు వద్ద చమురు డిపోలో పేలుళ్లు జరిపినట్టు మేయర్ చెప్పారు. ఇళ్లు, బంకర్లు, సబ్ వే స్టేషన్లలో ఉక్రెయిన్ ప్రజలు తల దాచుకున్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రభుత్వం రేపటి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఉక్రెయిన్ లో నాలుగో రోజు కొనసాగుతున్న రష్యా దాడులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -