Tuesday, November 5, 2024

చావో రేవో తేల్చుకోండి అంతే

- Advertisement -
- Advertisement -

Russian forces have stepped up attacks on Ukraine

 

కీవ్/మాస్కో : లొంగిపోండ లేదా చచ్చిపోండనే హుంకరింపులతో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై తమ దాడులను మంగళవారం ఉధృతం చేశాయి. మేరియుపోల్ స్టీల్‌ప్లాంట్‌లో కానీ మరెక్కడ కానీ తలదాచుకుని ఉనికిని చాటుకునే విఫల యత్నాలకు దిగరాదని రష్యా సైనికాధికారులు ఉక్రెయిన్‌ను హెచ్చరించాయి. చేతుల్లో ఉన్న ఆయుధాలు వీడి బయటకు వస్తే క్షమాభిక్షల ఆలోచన ఉంటుంది. లేకపోతే పరిస్థితి మరింత విషమం అవుతుందని రష్యా తెలిపింది. ఇప్పుడు రెండో దశ యుద్ధం మొదలైందని జెలెన్‌స్కీ ప్రకటించిన కొద్ది సేపటికే రష్యా తీవ్రస్థాయి హెచ్చరికలు వెలువడ్డాయి. రష్యాబలగాలు ఇటీవలి కాలంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ అధీనంలో ఉంటూ వస్తోన్నఅత్యంత కీలక ఆర్థిక ప్రాంతాలు పారిశ్రామిక వాడల నగరాలను సముద్ర మార్గాలను కేంద్రీకృతం చేసుకుని దాడికి దిగింది. ఈ క్రమంలో మేరియూపోల్‌నుదాదాపుగా రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. అయితే రష్యా సేనలకు తీవ్రస్థాయి ప్రతిఘటన ఇప్పుడు అక్కడి మేరియూపోల్‌లోని సువిశాల స్టీల్‌ప్లాంట్ స్థావరంలో తిష్టవేసుకుని ఉన్న అసంఖ్యాక సైనిక బలగాల నుంచి ఎదురవుతోంది.

యుద్ధం కొత్త దశ
సరెండర్ కానేకాం : జెలెన్‌స్కీ

తమ భూభాగానికి చెందిన డాన్‌బాన్ ధ్వంసానికి రష్యా సేనలు విరుచుకుపడి వస్తున్న విషయాలను నిర్థారణ అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ మంగళవారం తెలిపారు. అయితే తాము లొంగేది లేదన్నారు. రష్యా బలగాలు ఆధిపత్యం చాటుతూ ఉండొచ్చు కానీ మా ప్రతిఘటన సాగుతుందని చివరివరకూ పోరాడితీరుతామని ఆ నేత ప్రకటించారు. రష్యా సైనికులు ఏ సంఖ్యలో ఇక్కడికి వచ్చారనేది తాము పట్టించుకోబోమని, అత్యల్ప సంఖ్యాబలంతో అయినా చివరి వరకూ రష్యాను ఎదుర్కొంటామని, రష్యా అనుకుంటున్నట్లు ఈ ప్రతిఘటన ఇప్పట్లో సమసిపొయ్యేది లేదని , తాము రాజీకి దిగేవారిమి కానే కామని జెలెన్‌స్కీ తెలిపారు. మంగళవారం నాటి సందేశంలో జెలెన్‌స్కీ యుద్ధం కొత్త దశకు చేరుకుందని తెలిపారు కానీ ఈ రెండో దశ మార్పు ఏమిటీ? దీని పర్యవసానాలేమిటీ? అనేది వివరించలేదు,

బూచాళ్లు కాదు మీరు రక్షకులు
రష్యా సైనికులకు పుతిన్ సన్మానాలు

ప్రపంచం అంతా ఉక్రెయిన్‌లోని బుచాలో రష్యా సైనికుల దారుణకాండను ఖండించాయి. ఇక్కడి ఘటనలపై యుద్ధ నేరాల పరిధిలో విచారించాలని డిమాండ్లు వెలువడుతున్నాయి. అయితే బుచాలో సైనిక చర్యకు దిగి వచ్చిన రష్యా సైనిక దళానికి రష్యా దేశాధ్యక్షులు పుతిన్ ప్రశంసలు అందించారు. దేశం కోసం ధైర్యం ప్రదర్శించారని పేర్కొంటూ పుతిన్ ఈ జవాన్ల బ్రిగేడ్‌ను కొనియాడారు. వీరిని రక్షకులు గార్డ్ అని పేర్కొంటూ విడివిడిగా ఈ రష్యా ప్రముఖ పురస్కార పత్రాన్ని వారికి అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News