Wednesday, January 22, 2025

భయాలు తొలిగాయి.. ఆశలు చిగురించాయి

- Advertisement -
- Advertisement -
Russian forces withdraw from Ukraine border
ఉక్రెయిన్ సరిహద్దులనుంచి రష్యా బలగాలు వెనక్కి
డ్రిల్ ముగిసిందని రక్షణ శాఖ ప్రకటన
ఏ మేరకు ఉపసంహరించుకున్నదీ వెల్లడించని మాస్కో
దౌత్య చర్యలను ముమ్మరం చేసిన ఐరోపా దేశాలు
నేడు పుతిన్‌తో భేటీ కానున్న జర్మనీ చాన్సలర్

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడికి సిద్ధమవుతున్నాయని, బుధవారం దాడి చేయవచ్చంటూ అటు ఉక్రెయిన్, ఇటు అమెరికా సహా ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచమంతటా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రష్యావైపునుంచి ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులునుంచి కొన్ని రష్యన్ దళాలు వెనక్కి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన వెలవరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యల్లో భాగమా? కాదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరో వైపు డ్రిల్ పూర్తయిందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాల నేతలు దౌత్యపరంగా ఉద్రిక్తతలు తగ్గించే చర్యలను ముమ్మరం చేశారు. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్ష మందికి పైగా సైనికులను మోహరించిన రష్యా..భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయంనుంచి చాలావరకు సైన్యాన్ని బేస్‌కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎంతమేరకు సైన్యాన్ని వెనక్కి రప్పించింది, ఎందుకు రప్పించింది అనే విషయాలపై మరికొద్ది గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గత కొద్దివారాల్లో రష్యా వెనకంజ వేసిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో తమ దళాల విన్యాసాలు పూర్తయ్యాయని, తిరిగి తమ స్థావరాలకు చేరుకుంటున్నాయని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఐగర్ కొనషెంకోవ్ మంగళవారం చేసిన ప్రకటనలో తెలిపారు. అవి రైలు, రోడ్డు మార్గాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో రష్యా మిలిటరీ డ్రిల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బెలారస్‌లో సంయుక్త విన్యాసాలు, నల్లసముద్రంలో నావికాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రష్యా ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ విలేఖరులతో మాట్లాడుతూ, విన్యాసాలు పూర్తయిన తర్వాత సైన్యాలు తమ స్థావరాలకు తిరిగి వెళతాయని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. దీనిలో కొత్త విషయం ఏదీ లేదన్నారు. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియేనని చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందంటూ పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు మునుపెన్నడూ లేని ప్రచారం జరుగుతోందన్నారు. మరో వైపు ఉద్రికతలను తగ్గించడానికి యూరోపియన్ దేశాల నేతలు అటు మాప్కోలోను, ఇటు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోను ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

జర్మనీతో చర్చల నేపథ్యంలో?

ఇదిలా ఉండగా .. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా జర్మనీ ఈ విషయంలో మెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ చాన్సలర్ ఒలవ్ స్కోల్జ్ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే దళాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని రష్యా తీసుకుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా దౌత్య మార్గం పూర్తిగా మూసుకుపోలేదని అమెరికా చెప్తుండగా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలుకొనసాగిస్తూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News