Monday, January 20, 2025

భారత్ పర్యటించనున్న రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్

- Advertisement -
- Advertisement -

Sergey Lavrov

న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ దర్శించి వెళ్లిన కొన్ని రోజులకే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఈ వారం సందర్శించబోతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయి నెల రోజులు కావొస్తోంది. కాగా ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో గురువారం రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ గైర్హాజరు అయింది. ఉక్రెయిన్‌కు సంబంధించి ఈ క్లిష్టమైన తీర్మానానికి కావలసిన తొమ్మిది ఓట్లు రాకపోవడంతో తీర్మానం కాస్తా విఫలమైంది. ఈ తీర్మానానికి గైర్హాజరు కావడం వల్ల భారత్ మాస్కో వైఖరితో ఏకీభవించడంలేదని చాటింది. ఇదివరలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ పాశ్చాత్య దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా భారత్ గైర్హాజరు అయింది. ఇప్పటికీ భారత తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ఉంది. రష్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా న్యూయార్క్‌లోనే ఉన్నారు. తీర్మానానికి అనుకూలంగా చైనా, రష్యాతోనే ఉంది. తీర్మానానికి సిరియా, ఉత్తరకొరియా, బెలారస్ కోస్పాన్సర్లుగా ఉన్నాయి. కాగా భారత్, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని ఇతర సభ్యులు దీనికి గైర్హాజరు అయ్యారు. ఈ తీర్మానం రష్యా దాడిని గురించి ప్రస్తావించనే లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News