- Advertisement -
రష్యా విదేశాంగ మంత్రి హెచ్చరిక
మాస్కో: మూడవ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది అణ్వస్త్రాలతో కూడుకుని ఉంటుందని, అది వినాశనానికి దారితీయగలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బుధవారం హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోని కీవ్ అణ్వస్త్రాలను కలిగి ఉంటే గత వారం ప్రత్యేక సైనిక చర్యను చేపట్టిన రష్యాకు అసలైన ముప్పు ఎదురవుతుందని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖర్సాన్ నగరాన్ని తమ సేనలు స్వాధీనం చేసుకున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. ఖర్కీవ్ నగరంపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బుధవారం విస్తృతంగా దర్శనమిచ్చాయి.
- Advertisement -