మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. హెలికాప్టర్ లో ప్రయాణించిన అందరూ చనిపోయినట్లు సమాచారం. ఇప్పటికే 17 మంది మృత దేహాలను వెలికి తీశారు. మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో తూర్పు రష్యాలోని కమ్ చత్కా ద్వీపకల్పంలో వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి బయల్దేరింది, కానీ గమ్యస్థానం చేరుకోలేదు. వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమనుకుంటున్నారు.
A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4
— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024