రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్‌చత్కా రీజియన్ ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శనివారం అదృశ్యమైంది. 22 మందిలో 19 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఎంఐ8టీ శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ వచ్కజెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానానికి చేరలేదని రష్యా ఫెడరల్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ వెల్లడించింది.
టాస్ ప్రకారం ఇది ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్‌లైన్స్‌కు చెందినదని చెబుతున్నారు. వచ్చాజెట్స్ అగ్నిపర్వత సందర్శన సమయంలో ఇది అదృశ్యమైంది. ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను 1960 లో డిజైన్ చేశారు. రష్యాలోను, పొరుగుదేశాల్లోను ఈ హెలికాప్టర్‌ను విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఈ హెలికాప్టర్ మాస్కో నుంచి పర్యాటకులను సెయింట్ పీటర్స్ బర్గ్‌కు తరలిస్తోందని అధికారులు చెప్పారు. దీని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.