Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ స్ట్రామ్‌షాడో దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్ మృతి ?

- Advertisement -
- Advertisement -

కీవ్ ( ఉక్రెయిన్ ) : ఉక్రెయిన్ దళాలు రష్యాను గట్టిదెబ్బ తీశాయి. ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని మట్టుబెట్టాయి. ఇందుకోసం యూకె సరఫరా చేసిన స్ట్రామ్ షాడో క్షిపణిని ఉపయోగించాయి. బెర్డియాన్స్ నగరంలో రాత్రివేళ జరిగిన దాడిలో లెఫ్టినెంట్ జనరల్ ఒలేగ్ యూరివిచ్ త్సొకోవ్ మరణించారు. ఈ విషయాన్ని మేరియుపొల్ మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ కూడా ధ్రువీకరించింది.

రష్యా ఆక్రమిత ప్రాంతం లోని దున హోటల్‌లో రష్యా సైనిక నాయకత్వం లోని కీలక కమాండర్లు ఉంటున్నారు. ఈ దాడిలో హోటల్ మొత్తం పూర్తిగా నేల మట్టమైంది. ఈ భవనానికి అత్యంత సమీపం లోనే యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నా ఈ దాడి జరగడం విశేషం. ఈ దాడికి యూకె అందించిన స్ట్రామ్ షాడో క్షిపణిని వాడినట్టు సమాచారం. కుప్పకూలిన హోటల్ వద్ద పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు, భారీ పరికరాలతో కూడిన వాహనాలు వచ్చిశకలాలను తొలగిస్తున్నట్టు కీవ్ పత్రికలు పేర్కొన్నాయి.

గత ఏడాది సెప్టెంబరులో రష్యాకు చెందిన 20 వ కంబైన్డ్ ఆర్మీ సర్వీస్‌లోని 144 మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్‌కు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో లుహాన్స్‌పై ఉక్రెయిన్ శతఘ్ని దాడిలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత ఆయనను లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోట్ చేశారు. రష్యా అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించలేదు. రష్యా సైన్యంలో యూరివిచ్ త్సొకొవ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు చెచెన్య పోరాటాల నుంచి రష్యా చేసిన ప్రతి యుద్ధం లోనూ అతడు పాల్గొన్నాడు. రష్యా దళాలు క్రిమియా ఆక్రమణ సమయంలో అతడు కూడా ఉన్నాడు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News