రష్యా నుంచి అమెరికాలో వాలాడు
న్యూయార్క్ : ఎటువంటి పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా ఓ రష్యన్ ఇటీవల అమెరికాకు చేరుకున్నాడు. చివరికి టికెటు కూడా తీసుకోకుండా రష్యానుంచి అమెరికాకు చేరిన ఉదంతం తెలిసింది. చివరికి లాస్ ఏంజిలిస్‌లో పట్టుబడ్డాడు. సెర్గీ వ్లాదిమిరోఓవిచ్ ఒచిగవ అనే ఈ వ్యక్తికి రష్యా, ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం ఉంది. కోపెన్‌హేగన్‌లో స్కాడినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించి ఆయన లాస్ ఏంజిలెస్‌కు చేరారు. నవంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఘటనలో పట్టుబడ్డ వ్యక్తి తనిఖీలలో ఎటువంటి పాస్‌పోర్టు , వీసా చివరికి టికెటు కూడా లేదని తేలింది.
చివరికి ఏ విమానంలో కూడా ఆయన పేరు ప్యాసింజర్ల లిస్టులో లేదు. దీనిపై ఇప్పుడు ఎఫ్‌బిఐ దర్యాప్తు చేపట్టింది. అక్రమ ప్రయాణానికి దిగిన వ్యక్తి ఎకనామిక్స్, మార్కెటింగ్‌లలో పిహెచ్‌డి పొందారు. ఇంతకు ముందు రష్యాలో ఎకనామిస్టుగా పనిచేశారని విచారణలో వెల్లడైంది. ఈ వ్యక్తి ప్రయాణం ఇప్పుడు మిస్టరీగా మారింది. కాగా తనకు అలసటతో గంటల తరబడి నిద్రపట్టిందని, తాను అమెరికాకు ఏ విధంగా చేరానో తెలియడం లేదని, తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, వీటిని విమానంలోనే పొగొట్టుకుని ఉంటానని ఈ వ్యక్తి ఇప్పుడు కోర్టుకు విన్నవించుకున్నారు.