Wednesday, January 22, 2025

కుప్పకూలిన మిలిటరీ విమానం: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాలో 15 మందితో బయలుదేరిన ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్ప కూలింది. ఇఎల్ 76 అనే మిలిటరీ కార్గో విమానం మంగళవారం పశ్చిమ రష్యా లోని ఎయిర్‌బేస్ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాసేపటికే విమానం లోని ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఇవానోవో ప్రాంతంలో కుప్పకూలినట్టు ప్రకటించింది. ప్రమాద సమయంలో అందులోని 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది. విమానంలో ఉన్నవారి పరిస్థితి గురించి అధికారికంగా ఎవరూ వెల్లడించనప్పటికీ, వారెవరూ సురక్షితంగా లేరని రష్యా ఆన్‌లైన్ మీడియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News