Sunday, December 22, 2024

జెలెన్ స్కీ హత్యకు పుతిన్ స్కెచ్!

- Advertisement -
- Advertisement -

Russian militia’s plot to kill Ukraine leader

ఆఫ్రికా నుంచి కిరాయి గూండాలు
కలకలం సృష్టిస్తోన ఓ కథనం

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అందుకోసం కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందన్న వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వారంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ గా చెప్పుకుంటోన్న ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారిగా పేర్కొంది. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్ స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు ప్రతిన్ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు కథనం పేర్కొంది. వాగ్నర్ గ్రూపు పుతిన్ సన్నిహితుడు ఒకరు నిర్వహిస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ సన్నిహితుడిని పుతిన్ చెఫ్ అని ముద్దుగా పిలుస్తారట. వార్నర్ గ్రూపు ప్రణాళిక అమలు చేసేందుకు ఐదు వారాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతి చర్చల నేపథ్యంలో పుతిన్ తన ప్రణాళిక అమలుకు కాస్త విరామం ఇచ్చారని, ఈ విషయాన్ని వాగ్నర్ గ్రూప్ లోని సీనియర్ సభ్యుడి సన్నిహితుడిని ఉటంకిస్తూ కథనం పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News