Sunday, December 22, 2024

రష్యా క్షిపణిదాడిలో 16మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉమన్: రష్యా శుక్రవారం ఉదయం ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 16మంది ఉక్రెయిన్‌వాసులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో రెండు ఓ అపార్టుమెంటు భవనంపై పడటంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ శిశువుతోపాటు ముగ్గరు చిన్నారులు ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు తెలిపారు. అయితే ఈ దాడిలో కీవ్‌లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఉక్రెయిన్ వాయుసేన 11క్షిపణులు, రెండు డ్రోన్లను అడ్డుకున్నాయన్నారు.

అయితే కీవ్‌కు సుమారు 215కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమన్‌లో జరిగిన దాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. ఉమన్‌లోని అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడుల జరిగింది. ఈ దాడిలో పదేళ్ల ఇద్దరు పిల్లలతోపాటు పద్నాలుగుమంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. 17మంది గాయపడ్డారని వీరిలో తీవ్రంగా గాయపడిన తొమిదిమంది ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఉక్రెయిన్ జాతీయ పోలీస్‌వర్గాలు తెలిపాయి. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు పిల్లలను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. కాగా రెండు నెలల అనంతరం కీవ్‌పై రష్యా దాడిచేయడం ఇదే ప్రథమం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News