Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌లో నివాస భవనంపై రష్యా క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

Russian missile attack hits residential buildings

19 మంది మృతి: 38 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్‌లోని రేవు పట్టణం ఒడెసా సమీపంలోని నివాస ప్రాంతాలపై శుక్రవారం తెల్లవారుజామున రష్యా జరిపిన క్షిపణి దాడులు 19 మంది పౌరులను బలిగొన్నాయి. ఒడెసాకు వాయువ్యాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెర్హీవికా అనే చిన్న పట్టణంలోని నివాస భవనాలపై రష్యా క్షిపణులు దాడులు జరిపాయి. రష్యా బాంబర్లు పేల్చిన మూడు ఎక్స్ 22 క్షిపణులు ఒక అపార్ట్‌మెంట్ భవనంతోపాటు రెండు క్యాంప్ బేసెస్‌ను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. యుద్ధంలో ఓడిపోతున్నందుకు కక్షతో ఆ ఉగ్ర దేశం పౌరులపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సైన్యాధ్యక్షుడు ఆండ్రీ యెర్మాక్ విమర్శించారు. రష్యా దాడులలో ఇద్దరు పిల్లలతో సహా 19 మంది మరణించగా ఆరుగురు పిల్లలు, ఒక గర్భిణితోసహా మరో 38 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. వీరిలో చాలామంది అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News