Sunday, January 19, 2025

కీవ్‌పై రష్యా క్షిపణుల దాడి… మృతుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం ఉదయం రష్యా భారీ ఎత్తున క్షిపణి దాడులు చేసింది. దాదాపు 10 కి పైగా క్షిపణులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాస్కోపై డ్రోన్ దాడులు జరిగిన మర్నాడే ఈ దాడులు జరగడం గమనార్హం. గతనెల కీవ్‌పై రష్యా చేసిన 17 దాడుల్లో చాలావరకు రాత్రుళ్లు చేసినవే.

ఇప్పుడు ఉదయం దాడులకు రష్యా పాల్పడింది. ఇటీవల కాలంలో రష్యా ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్ క్షిపణి దాడులు ముమ్మరమయ్యాయి. ఉక్రెయిన్ ఎదురు దాడి చేస్తోందనే ఉక్రోషంతో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీయాలని రష్యా లక్షంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా బుధవారం ఉక్రెయిన్ జరిపిన దాడులు కారణంగా లుహాన్స్ ప్రాంతంలో ఓ కోళ్ల ఫారం వద్ద ఐదుగురు చనిపోగా, 19 మంది గాయపడినట్టు రష్యా ప్రకటించింది.

గురువారం తెల్లవారు జామున కూడా బెల్గొరోడ్ సమీపం లోని షెబ్‌కిబినో వద్ద ఉక్రెయిన్ దాడికి ఇద్దరు గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. అమెరికా నుంచి మరో 300 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఉక్రెయిన్‌కు అందనుండడం పై రష్యా ఆగ్రహించింది. అమెరికా తన మిత్ర దేశాలకు ఆయుధాలు సరఫరా చేసి అనవసరమైన పనులను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News