Thursday, January 23, 2025

ఉక్రెయిన్ నల్లసముద్రం రేవుపై రష్యా క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

Russian missile attack on Ukraine's Black Sea port

ధాన్యాల ఎగుమతి ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ..
ఇది ఒప్పందం కుదిర్చిన వారి ముఖాలపై ఉమ్మివేయడమేనని ఉక్రెయిన్ ధ్వజం
ఈ దాడిని నిర్దంధ్వంగా ఖండించిన ఐరాస అధినేత గుటెర్రస్

కీవ్ (ఉక్రెయిన్) : నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు ఆహార ధాన్యాల ఎగుమతులను తిరిగి ప్రారంభించడానికి ఒప్పందాలు కుదిరిన కొన్ని గంటలు కాకముందే రష్యా మళ్లీ నల్లసముద్రం ఓడరేవు ఒడెసాపై క్షిపణుల దాడితో శనివారం విరుచుకుపడింది. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది ఒప్పందం కుదిర్చిన టర్కీ, అమెరికా దేశాల ముఖంపై ఉమ్మివేయడం లాంటిదని విమర్శించింది. కుదిరిన ఒప్పందాలను ఇది ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఒప్పందం కుదిరి 24 గంటలు కాకముందే రష్యా క్షిపణి దాడిని ప్రారంభించడం కట్టుబడిన ఒప్పందాలను రష్యా ఉల్లంఘించడమేనని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఒలెగ్ నికొలెంకో తూర్పారబట్టారు. ఈ ఒప్పందాలు నెరవేరక పోతే ప్రపంచ ఆహార సంక్షోభానికి రష్యా బాధ్యత వహించక తప్పదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యాదాడి ప్రారంభించి 150 వ రోజున ఈ దాడి జరిగిందని, ఒప్పందం కుదిర్చిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ముఖాలపై ఉమ్మివేయడం వంటిదని విమర్శించారు.

ఈ చర్యను సమితి అధినేత నిర్భయంగా ఖండిస్తున్నారని గుటెర్రస్ కార్యాలయం ప్రకటించింది. రష్యాకు చెందిన రెండు కల్వీర్ క్రూయిజ్ క్షిపణులు ఒడెస్సా రేవు మౌలిక సౌకర్యాలను చిన్నాభిన్నం చేశాయని, ఆ రెండింటినీ ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు నేలకు కూల్చాయని ఉక్రెయిన్ మిలిటరీ దక్షిణ భాగం కమాండ్ వెల్లడించారు. ఈ దాడిలో ఎంత ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయో వివరించలేదు. రష్యాఉక్రెయిన్ యుద్ధ పరిణామాల పర్యవసానంగా ఏర్పడిన ఆహార సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గురువారం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుర్కియే (టర్కీ) రాజధాని ఇస్తాంబుల్‌లో ఐక్యరాజ్యసమితితో వేర్వేరుగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీనివల్ల నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు ఆహార ధాన్యాలు, రష్యా నుంచి ఎరువులు, దాన్యం ఎగుమతులు నల్లసముద్రం వెంబడి ఒడెస్సా, చెర్నోమోర్స్, యుజ్నీ ఓడరేవుల నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని ఆశించారు. ఉక్రెయిన్‌లో నిర్బంధంలో ఉన్న మిలియన్ల టన్నుల ధాన్యానికి విముక్తి లభిస్తుందని అంచనా వేశారు. అయితే ఇవన్నీ ఇప్పుడు రష్యా దాడితో తారుమారైనట్టు అనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News