Tuesday, November 5, 2024

ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణుల దాడి.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ లోని పెద్ద నగరాలైన కీవ్, ఖర్కివ్‌లను లక్షంగా చేసుకుని మంగళవారం ఉదయం రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 బాలిస్టిక్, క్రుయెజ్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులతో రష్యా చేసిన ఈ దాడుల్లో 21క్షిపణులను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది.

దాడుల్లో కీవ్ లోని నాలుగు జిల్లాల్లో 20 మంది గాయపడగా, ఖర్కివ్‌లో 48 మంది గాయపడడంతోపాటు ఐదుగురు మృతి చెందారు. 30 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. అపార్ట్‌మెంట్ల లోని వందలాది కిటికీలు ధ్వంసమై చెల్లాచెదురయ్యాయి. రష్యా ఎస్300, కెహెచ్ 32 , హైపర్‌సోనిక్ ఇస్కాండర్ క్షిపణులను దాడికి ఉపయోగించిందని రీజినల్ గవర్నర్ ఒలెహ్ సైనీహ్‌బోవ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News