Thursday, March 6, 2025

జెలెన్‌స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో జెలెన్‌స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరిగింది. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణి దాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతోపాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. ఈ సంఘటనలో సుమారు 30 మంది గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ అధికారం లోకి వచ్చిన తరువాత నుంచి ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల వ్యవధి లోనే మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యం లోనే తాజాగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రీవిరీహ్ లోనే జెలెన్‌స్కీ జన్మించారు.

జెలెన్‌స్కీ తోడుగా అమెరికాకు మేక్రాన్, స్టార్మర్
వైట్‌హౌస్‌లో ఇటీవల యూఎస్, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన చర్చ కాస్తా రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. దాని తర్వాత మరోసారి అమెరికాతో తాము చర్చలకు సిద్ధమేనని జెలెన్‌స్కీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి యూఎస్ పర్యటనలో ఆయనతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా మేక్రాన్ ఆలోచన చేస్తున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా వెళ్లడం ద్వారా ఐరోపా ఐక్యత చాటుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News