- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ రాజధానిలో కీవ్‌లోని పిల్లల ఆసుపత్రితోసహా అనేక నివాస భవనాలపై రష్యా క్షిపణులు సోమవారం ఉదయం విరుచుకుపడడంతో కనీసం ఏడుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలపై రష్యా క్షిపణులు జరిపిన దాడులలో మరో 10 మందికిపైగా మరణించారు. వివిధ రకాలకు చెందిన 40కి పైగా క్షిపణులు ఉక్రెయిన్ నగరాలపై దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం రష్‌యా క్షిపణులు జరిపిన దాడిలో 20 మంది వరకు మరణించగా మరో 31 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. సెంట్రల్ నిప్రోపెట్రోవోస్క్ ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. కీవ్‌లోని ఓక్‌మాడిట్ పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడులు జరిగాయని జెలెన్‌స్కీ తెలిపారు. కూలిపోయిన ఆసుపత్రి భవన శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారన్న విషయం ఇకంకా తెలియరాలేదని ఆయన చెప్పరు.
- Advertisement -