Tuesday, April 8, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ తూర్పు నగరమైన డోబ్రోపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని సెటిల్‌మెంట్లపైన రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 14 మంది చనిపోగా, ఐదుగురు బాలలు సహా 37 మంది గాయపడ్డారని శనివారం ఉక్రెయిన్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాక బహుళ అంతస్తుల భవనాలు, 30 వాహనాలు దెబ్బతిన్నాయని కూడా పేర్కొంది. ‘ఈ దాడులతో రష్యా వైఖరి ఇప్పటికీ మారనట్లు కనిపిస్తోంది. మన జనులను మనం రక్షించుకోవాల్సి ఉంది.

అందుకు మన వైమానిక రక్షణ శక్తిని పెంచుకోవాల్సి ఉంది.రష్యా మీద ఆంక్షలను పెంచాల్సి ఉంది. పుతిన్ ఆర్థిక బలాన్ని పెంచే ప్రతి దానిని దెబ్బతీయాల్సి ఉంది. అంతేకాక యుద్ధాన్ని అంతం చేయాల్సి ఉంది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలన్సీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో అమెరికా తన ఇంటెలిజెన్స్ వివరాలు షేర్ చేసుకోవడం ఆపేశాక, రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసి విద్యత్తు, గ్యాస్ మౌలికవసతులను దెబ్బతీసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వీలయినంత త్వరగా ఆగాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News