Friday, December 20, 2024

ఉక్రెయన్ నగరంపై రష్యా క్షిపణి దాడి..ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోమ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం స్వీడన్ పర్యటనకు వెళ్లగా, అదే సమయంలో స్వదేశం ఉక్రెయిన్ లోని ఉత్తర ప్రాంత నగరం చెర్మిహివ్‌పై రష్యా క్షిపణి దాడి జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 90 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరేళ్ల బాలిక ఉండగా, గాయపడిన వారిలో 12 మంది పిల్లలు ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఐహోర్ క్లెమింకో వెల్లడించారు. థియేటర్, యూనివర్శిటీ కూడా దాడికి గురవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు.

ఒక ఉగ్రవాద దేశంగా రష్యా ఈ దాడి సాగించి విపరీత నష్టాన్ని కలిగించిందని టెలిగ్రామ్ ద్వారా ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపాన గల రోస్తోవ్ ఆన్‌డాన్ నగరంలో మిలిటరీ ఉన్నతాధికారులతో సమావేశమై ఉక్రెయిన్‌లో రష్యా ఆపరేషన్స్ గురించి తెలుసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్వీడిష్ ప్రభుత్వం రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఇతర సహాయాన్ని అందివ్వనున్నట్టు ప్రకటించింది. స్వీడన్ ప్రధానిని, స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్, రాణి సిల్వియాలను జెలెన్‌స్కీ కలుసుకుంటారని స్వీడిష్ ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News