- Advertisement -
కీవ్: పొలాండ్ సరిహద్దుకు దగ్గిర, ఉక్రెయిన్ పశ్చిమ నగరమైన ఎల్వివ్ బయట సైనిక శిక్షణ మైదానంపై రష్యా దళాలు అనేక దాడులు చేశాయని స్థానిక అధికారి తెలిపారు. ‘శాంతి మరియు భద్రత అంతర్జాతీయ కేంద్రంపై రష్యా వైమానిక దాడిని ప్రారంభించింది’ అని ఎల్విన్ ప్రాంతీయ పరిపాలన అధిపతి మాగ్జిమ్ కోజిట్కీ తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. దాడికి గురైన ఈ సైనిక స్థావరం ఎల్వివ్‌కు వాయువ్యంగా 40 కిమీ. దూరంలో ఉంది. ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు కూడా ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రాణనష్టంకు సంబంధించిన ఎటువంటి సమాచారం అందలేదు. రష్యా దాడి మొదలెట్టినప్పటి నుంచి ఉక్రెయిన్లు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ఇదిలావుండగా ‘ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఉదయం పేలుళ్ళు విమానాశ్రంపై దాడితో మొదలయ్యాయి’ అని మేయర్ రుస్లాన్ మార్టింకివ్ ఫేస్‌బుక్‌లో తెలిపారు.
- Advertisement -