Sunday, December 22, 2024

క్రిమియా తీరంలో అలజడి.. రష్యా నౌకాదశంపై డ్రోన్ దాడి

- Advertisement -
- Advertisement -

Russian navy repels drone attack

మాస్కో : రష్యా ఆక్రమిత క్రిమియాలో విధులు నిర్వహిస్తున్న మాస్కో దళాలపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడిని క్రెమ్లిన్ నౌకాదళం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు శనివారం వెల్లడించారు. కెర్చ్ వంతెన పేలుడుతో రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ… ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. క్రిమియా లోని సెవాస్టోపోల్ పోర్ట్ వద్ద విధుల్లో ఉన్న మాస్కో నల్లసముద్రం నౌకాదళం లక్షంగా శనివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సెవాస్టోపోల్ గవర్నర్ మైఖెల్ రజ్వోజయెవ్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు. కొన్ని గంటల పాటు మాస్కో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దాడులను తిప్పి కొట్టాయని పేర్కొన్నారు.

అన్ని మానవ రహిత వాహనాలను రష్యా నేవీ కాల్చివేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. అయితే ఈ దాడుల్లో రష్యాకు చెందిన పలు యుద్ధ నౌకలు దగ్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తీర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్మేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన నేపథ్యంలో హార్బర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఇదిలా ఉండగా, ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం జరిపి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సెవాస్టోపోల్ సమీపం లోని ఓ థర్మల్ విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. రష్యా ఆక్రమిత క్రిమియా లోని మాస్కో సేనలపై డ్రోన్ దాడులు జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచే ఆస్కారముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News