Monday, December 23, 2024

రష్యా అణుక్షిపణి పరీక్ష

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా తన ఖండాంతర అణుపాటవ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని రష్యా సైనిక వర్గాలు ఆదివారం ప్రకటించాయి. సరికొత్త న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి ఈ క్షిపణని పరీక్షించారు. దీనిద్వారా న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను తాము ఎంచుకున్న లక్షాలను దెబ్బతీసేందుకు ఈ ఖండాంతర క్షిపణులతో వీలేర్పడుతుంది. ఉక్రెయిన్‌తో ఘర్షణలు తీవ్రస్థాయి ఉద్రిక్తతలు సాగుతున్న దశలోనే ఖండాంతర క్షిపణిని రష్యా పరీక్షించడం కీలక అంశం అయింది. అలెక్సాండర్ 3 క్రూయిజర్ నుంచి బులావా ఖండాంతర క్షిపణిని రష్యా నార్తర్న్ వైట్‌సీలోని సముద్రంలోపలి స్థావరం నుంచి ప్రయోగించారు. అయితే ఎప్పుడు ఈ ప్రక్రియ చేపట్టిందనేది సైనిక వర్గాలు తెలియచేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News