Sunday, December 22, 2024

దారితప్పిన వార్‌తో కొత్త ముప్పు

- Advertisement -
- Advertisement -

Russian nuclear weapons on the Moskva warship

మాస్కూవా యుద్ధ నౌకలో రష్యా అణ్వాయుధాలు
మునిగాయా? పేలాయా? వాటి జాడేది
పలు అణుమానాలతో నిపుణుల ఆందోళన

కీవ్/ మాస్కో : ఇటీవల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్కూవా అత్యంత ప్రమాదకరమైనది. అణ్వాయుధాలను సంతరించుకుని కీలక లక్షంతో సంచరించింది. ఇటీవల ఈ యుద్ధనౌక ఉక్రెయిన్ బ్లాక్‌సీ సమీపపు సెవాస్టోపల్ పోర్టు సిటీ వద్ద నీటమునిగింది. ఈ పరిణామంతో రష్యా కంగుతింది. ఈ క్రూయిజర్‌లో ఏముంది? ఎటువైపు వెళ్లుతోందనే వివరాలను రష్యా అధికారికంగా తెలియచేయలేదు. అయితే ఈ మునిగిన యుద్ధ నౌకలో అత్యంత భారీస్థాయి రెండు శక్తివంతమైన అణ్వాయుధపు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయని ఉక్రెయిన్ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రమాదంలోనే ఇది సముద్రంలో మునిగిందని రష్యా వాదిస్తోంది. అయితే తమ యాంటీషిప్ నెప్టున్ మిస్సైల్ ప్రయోగంతోనే దీనిని సముద్రంలో ముంచి వేశామని ఉక్రెయిన్ వెల్లడించింది. ఇది సాధారణపు యుద్ధ నౌకకాదని, రెండు భయంకర న్యూక్లియర్ హెడ్స్‌తో సంచరిస్తూ క్షిపణి దాడికి గురైందని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా యుద్ధ నౌకను ఉక్రెయిన్ సేనలు కూల్చివేయడం ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న వార్త అయితే ఈ మునిగిన వార్‌షిప్‌లో భారీ స్థాయి అణ్వాయుధాలు ఉన్నాయనేది అత్యంత కీలక వార్త అని బ్లాక్‌సీ వ్యవహారాల నిపుణులు అండ్రిల్ కిలిమెంకో తెలిపారని ఇక్కడి వార్తాసంస్థలు తెలిపాయి.

ఈ వార్‌హెడ్స్ ఎక్కడివి , ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకోసం వెళ్లుతున్నాయి? ఇంతకూ నీట మునిగిన నౌకలోని న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి. వీటి పరిస్థితి ఏమిటనేది కీలక అంశం అని ఈ నిపుణులు తెలిపారు. నౌక మునిగిన దశలో సంభవించిన పేలుడు దశలో ఈ న్యూక్లియర వార్ హెడ్స్ పరిస్థితి ఏమిట? అనేది నిర్థారణ కాలేదు. న్యూక్లియర్ వార్‌హెడ్స్‌తో రష్యా సేనలు సముద్రాలలో విహరిస్తూ ఉంటే ఇక అంతర్జాతీయ సంస్థలు భద్రతా మండలి వంటివి ఏం చేస్తున్నాయి? అని ఈ నిపుణులు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని అంటే బ్లాక్‌సీ తీర దేశాలైన టర్కీ, రొమేనియా, బల్గేరియా, జార్జియాలు ఈ అంశంపై స్పందించాల్సి ఉందని తెలిపారు. ప్రమాదకరమైన న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో సముద్రంలో కలియతిరిగే నౌకలు ప్రపంచానికి మరింత ప్రమాదకారి అవుతాయని హెచ్చరించారు.

ఇక్కడ ఈ రష్యా యుద్ధ నౌకను ఉక్రెయిన్ క్షిపణులతో దెబ్బతీయడం సంచలనాత్మకమే అయితే ఈ మునిగిన నౌకలో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండటం, తరువాత వాటి సంగతి ఏమిటీ అనేది ఇప్పటికీ తెలియకపోవడం అంతర్జాతీయంగా పలు ప్రశ్నలకు దారితీస్తోందని ఉక్రెయిన్ నిపుణులు తెలిపారు. న్యూక్లియర్ వార్ హెడ్స్ సముద్రంలో మునిగిపోతే అది అంతర్జాతీయ పరిణామం అవుతుందని, దీనిని కేవలం రష్యా ఉక్రెయిన్ పరస్పర పోరులో భాగంగా కొట్టిపారేయడానికి వీల్లేదని ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. రష్యా యుద్ధ నౌక సముద్రంలో మునిగిన ఘటనతో ఇక మూడో ప్రపంచ యుద్ధం అనధికారికంగా ఆరంభం అయినట్లే అని ఇటీవలే రష్యా అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News