Thursday, January 23, 2025

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ తో సహా 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ తోపాటు మరో ఏడుగురు మృతి చెందారు. దేశ రాజధాని మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ ఎంబ్రేయర్‌ లెగసీ విమానం ట్వెర్‌ ప్రాంతంలోని కుజెంకినో అనే గ్రామ సమీపంలో కూలిపోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ తో సహా 10మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఓవైపు, ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్య కొనసాగుతుండగా..మరోవైపు వాగ్నర్ అధినేత ప్రిగోజిన్, పుతిన్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. పుతిన్ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రిగోజిన్, పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారు. అయితే, చర్చల ద్వారా ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News