Monday, January 20, 2025

మేము దేశభక్తులం.. లొంగిపోం

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాకు వెన్నుపోటు పొడిచిన వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్‌పై కఠిన చర్యలు తప్పవని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించినప్పటికీ ఆ గ్రూపు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తమ విషయంలో పుతిన్ పొరబాటు పడ్డారని, తాము దేశ భక్తులమని ప్రిగోజిన్ అన్నారు. అలాగే ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తాడని కూడా ప్రకటించారు.పుతిన్ దేశప్రజలనుద్దేశించి ప్రకటించిన తర్వాత ప్రిగోజిన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

మేం ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశ భక్తులం. ఏ ఒక్కరూ లొంగిపోవడం లేదు. ఎందుకంటే మేం ఈ దేశం అవినీతి, అబద్ధాలు, బ్య్రూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు.పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’ అంటూ పుతిన్ ప్రభుత్వంపై ప్రిగోజిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News