Thursday, January 23, 2025

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం… కారుపై బాంబు దాడి

- Advertisement -
- Advertisement -

Russian President Putin's car bombed

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు వార్తలు వచ్చాయి. పుతిన్ తన నివాసానికి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న లిమోసిన్ కారు ముందువైపు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిందని జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై కారునుంచి పొగలు వస్తున్నప్పటికీ అధ్యక్షుడి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని పేర్కొంది. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి హానీ జరగలేదని, ఆ తర్వాత మరో బ్యాక్‌అప్ కాన్వాయ్‌లో పుతిన్‌ను అధ్యక్ష నివాసానికి తరలించారని క్రెమ్లిన్ అంతర్గత వర్గాలు చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. ఘటన సమయంలో పుతిన్ కాన్వాయ్ లోని తొలి ఎస్కార్ట్ కారుకు అంబులెన్స్ అడ్డుగా వచ్చిందట. రెండో ఎస్కార్ట్ కారు ఆగకుండా వెళ్లి పోయినట్టు పేర్కొంది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ప్రమాదం తరువాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినట్టు సమాచారం. భద్రతలో రాజీ పడినందుకు పుతిన్ సెక్యూరిటీ సర్వీస్‌కు చెందిన పలువురు అదికారులను అరెస్టు చేసినట్టు ఆ ఛానల్ తెలిపింది. అధ్యక్షుడి బాడీగార్డ్ సర్వీస్ హెడ్ సహా పలువురు ఉన్నత అధికారులను సస్పెండ్ చేసి కస్టడీ లోకి తీసుకున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి రష్యాలో కొన్ని వర్గాల నుంచి పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమం లోనే ఆయనపై దాడికి యత్నించి ఉంటారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొద్ది నెలల క్రితం కాకసస్ పర్యటనలో పుతిన్ ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు గతంలో వెల్లడించాయి. తనపై హత్యాయత్నాల గురించి 2017లో పుతిన్ ఓసారి స్వయంగా ప్రకటించారు. అప్పటివరకు తనపై ఐదు సార్లు హత్యాయత్నాలు జరిగాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News