Saturday, December 28, 2024

ఒత్తిళ్లకు బెదరక అదరక సాగే మోడీ :పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో : భారత ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు కడు పటిష్టంగా, బాగున్నాయని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. ప్రధాని మోడీ తమ దేశ జాతీయ ప్రయోజనాలలో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. ఇందుకు పలు కటుతర నిర్ణయాలకు దిగుతున్నారు. ఈ విషయంలోఎటువంటి ఒత్తిళ్లకు తల్గొకుండా వ్యవహరిస్తున్నారని, ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. రష్యా కాలింగ్ ఫోరమ్ సమావేశంలో శనివారం పుతిన్ మాట్లాడారు. రష్యా, భారత్ మధ్య ఎదుగుతోన్న సంబంధాలకు ఆయన పాలసీలు ప్రధాన గ్యారంటీలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.

ఏ విషయంలోనూ, ఏ శక్తితోనూ మోడీ భయపడుతాడని తాను అనుకోవడం లేదన్నారు. పలు దఫాలుగా ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో భారతదేశం, దేశ ప్రజల ప్రయోజనాలు రక్షింపబడుతున్నాయని విశ్లేషించారు. భారత్ , రష్యా మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు పురోగమిస్తున్నాయని వివరించారు. ప్రధాని మోడీపై పలు దేశాల నుంచి ప్రత్యేకించి అమిత్ర దేశాల నుంచి పదేపదే పలు విషయాలలో ఒత్తిడి ఉంటోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తాను , ప్రధాని మోడీ ఎక్కడా ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఈ విషయం ప్రస్తావనకు రాలేదని తెలిపారు. ఫోరం వేదిక నుంచి పుతిన్ చేసిన ప్రసంగ వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News