Sunday, January 19, 2025

పుతిన్ విమర్శకుడిని నిర్బంధించిన ఒడిశా పోలీసులు!

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వద్ద అడుక్కుంటున్న రష్యా దేశస్థుడు ఆండ్రూ గ్లాగోలెవ్‌ను ఒడిశా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. చాలా రోజుల నుంచి భువనేశ్వర్ రైల్వేస్టేషన్ వద్ద ‘నేను రష్యా కాందీశీకున్ని, నేను యుద్ధానికి వ్యతిరేకిని, నేను పుతిన్‌కు వ్యతిరేకిని, నాకు దయచేసి సాయం చేయండి’ అన్న ప్లకార్డు పట్టుకుని అడుక్కుని అడుక్కుంటున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం అతడు టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చాడు. అది ఇప్పుడు కాలం చెల్లింది. అతడి వద్ద డబ్బు కూడా లేదు. అతడు రైల్వే స్టేషన్ వద్ద అడుక్కుంటున్నాడు. అతడికి ఇంగ్లీషు కూడా రాదు. దాంతో రష్యాలో అతడి మాట్లాడ్డం ఎవరికీ రాలేదు. తర్వాత అతడి సమాచారం రైల్వే స్టేషన్ పోలీసులకు తెలియడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. భారత్‌కు ఏ ఉద్దేశ్యంతో వచ్చాడని, అతడి సమస్యలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ జయదేవ్ బిశ్వజిత్ మాట్లాడుతూ ఆండ్రూ చెల్లుబాటు పాస్‌పోర్ట్, వీసాలపైనే భారత్ వచ్చాడని, కానీ అతడి టూరిస్టు వీసా కాలం చెల్లిందని, అయితే అతడు సంబంధిత ఐక్యరాజ్యసమితి అధికారులకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. ‘ఆ రష్యా జాతీయుడు ఐక్యరాజ్యసమితికి దరఖాస్తు చేసిన దస్తావేజులు చూయించాడు. మేము సంబంధిత అధికారితో దాన్ని వెరిఫై చేస్తాము. ఇప్పటి వరకు అతడు ఎక్కడ నివసించాడు, ఎక్కడెక్కడ వెళ్లాడు అన్నది కూడా పరిశోధిస్తున్నాము’ అని తెలిపారు. ఇదిలావుండగా రష్యా శాసనసభ్యుడు పావెల్ ఆంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బిదెనోవ్ రాయగడలోని హోటల్‌లో అనుమానస్పద పరిస్థితుల్లో మరణించారన్నది ఇక్కడ గమనార్హం.

ఒడిశా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆంతోవ్ ప్రమాదవశాత్తు హోటల్ టెర్రాస్ నుంచి పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఆ ఇద్దరు రష్యా జాతీయుల మరణాల వెనుకు ఏదో అదృశ్య శక్తి పనిచేసిందా అన్నది కూడా చూడాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News