Monday, December 23, 2024

ఉక్రెయిన్ల ముందు కన్నీళ్లు పెట్టుకున్న రష్యా సైనికుడు

- Advertisement -
- Advertisement -

Russian soldier in tears in front of Ukraine

కీవ్ : లొంగిపోయిన ఒక రష్యా సైనికునికి ఉక్రెయిన్ ప్రజలు ఆహారం ఇచ్చి, ఆదరించారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆ సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీడియో కాల్‌తో రష్యాలో ఉన్న తన తల్లితో మాట్లాడుతూ బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నీళ్లలో మునిగిన ఆ కొడుకును (యుద్ధఖైదీ) ఆ తల్లి ‘అంతా చక్కబడుతుంది. మైసన్’ అని ఓదార్చింది. కెమెరా పక్కనున్న ఒక వ్యక్తి అరుపులు వీడియోలో వినిపిస్తున్నాయి. “ వాస్తవానికి ఈ యువకులు అమాయకులు. .. అది వీళ్ల తప్పుకాదు. వాళ్లకు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా తెలియదు” అని కెమెరా పక్కన ఒకరు అన్నారు.

ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రష్యా సైనికులు లొంగిపోతున్నారు. వారికి ఉక్రెయిన్ ప్రజలు ఆహారం పెట్టి ఆదరిస్తున్నారు. మిగతావారు కూడా లొంగిపోండి అని కాప్షన్స్ రాస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం రష్యా సైనికులపై సానుభూతి వ్యక్తం చేశారు. “వీరు సూపర్ పవర్ కోసం వచ్చిన యుద్ధ వీరులు కాదు. గందరగోళంలో చిక్కుకున్న విద్యార్థులుగా వీరిని వాడుకుంటున్నారు. బందీలంతా ఒక్కటే మాట చెబుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారో వారికి తెలియదు. ఇప్పటికే వచ్చిన వారి కంటే రాబోయే సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువే అయినప్పటికీ శత్రువు నైతికంగా క్షీణిస్తున్నారు.”అని జెలెన్‌స్కీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News