Monday, December 23, 2024

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 10 మంది పౌరులు మృతి

- Advertisement -
- Advertisement -
20 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా సుదూర క్షిపణి దాడుల్లో శుక్రవారం కనీసం 10 మంది పౌరులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగితే ఎదుర్కొనడానికి క్రెమ్లిన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని మాస్కో సీనియర్ అధికారి హెచ్చరించారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్ ప్రాంతంలోని కోస్టియాంటినివ్కా అనే పట్టణంలో రష్యా క్షిపణులు సహాయక కేంద్రాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. ఉక్రెయిన్ అధికారులు గత సంవత్సరం ‘అదృశ్య స్థావరాలు’ (ఇన్విన్సిబిలిటీ పాయింట్స్) అని పిలిచే వందలాది స్థావరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ యుద్ధ పీడితులు సేద తీరవచ్చు, తమ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవచ్చు, స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. కోస్టియాంటినివ్కాపై రష్యన్లు ఎస్300 యాంటీఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్స్‌తో దాడులు చేశారు. చనిపోయిన వారు కాందీశికులని డొనెత్స్క్ గవర్నర్ పావ్లో కిరిలెన్‌కో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News