Sunday, November 24, 2024

ఖార్కివ్‌నుంచి రష్యా సేనలు వెనక్కి!

- Advertisement -
- Advertisement -

Russian troops withdraw from Kharkiv!

తూర్పు ఉక్రెయిన్ డాన్‌బాస్‌పై దాడులు ఉధృతం
రష్యా సైనికుడిపై యుద్ధ నేరాల విచారణ

కీవ్: రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్‌చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఆ నగరంలో ఉన్న రష్యా సైన్యాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. ఈ సిటీ కోసం జరిగిన పోరులో తాము విజయం సాధించామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ సిటీనుంచి రష్యా దళాలు వెనుదిరుగుతున్నట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. గడచిన రెండు వారాలుగా ఖార్కివ్ ప్రశాంతంగా ఉన్నట్లు ఓ వార్తాసంస్థ జర్నలిస్టులు తెలిపారు. అయితే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై మాత్రం ఇంకా రష్యా బాంబుదాడులు కొనసాగుతున్నాయి.ఖార్కివ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డెర్‌గాచీవద్ద శుక్రవారం బాంబుదాడులు జరిగాయి.అక్కడ ఉన్న ఓ ఆయుధ డిపోపై రష్యా దళాలు దాడులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యాకు ఖార్కివ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే తొలి లక్షంగా ఉండేది. ఆరంభంలోనే ఆ నగరంపై భీకర దాడులు జరిగాయి.

కాగా ఖార్కివ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ప్రజలు తిరిగి ఇండ్లకు చేరుకుంటున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. అయితే ఖార్కివ్‌నుంచి వొదొలగిన రష్యా తూర్పు ప్రాంతమైర డాన్‌బాస్‌పైన ఎక్కువగా దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. రష్యా మద్దతుగల వేర్పాటువాదుల పాక్షిక కంట్రోల్‌లో ఉన్న ఈ ఖనిజ, పారిశ్రామిక ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్షంగా రష్యా దాడులు సాగిస్తోంది. అయితే తూర్పు ఉక్రెయిన్‌లోని సివెర్‌స్కీ డొనెట్స్ నదిని దాటుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్ బలగాలు విరుచుకు పడినట్లు బ్రిటీష్ అధికారులు శుక్రవారం తెలిపారు. పదుల సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, జవాన్లు హతమయ్యారని వెల్లడించింది.

రష్యా సైనికుడిపై యుద్ధ నేరాల విచారణ

ఇదిలా ఉండగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మొదటినుంచి ఆరోపిస్తున్న ఉక్రెయిన్ తొలిసారిగా ఆ అభియోగాల కింద రష్యా సైనికుడిపై విచారణకు తెరతీసింది. చుపాకివ్‌కా గ్రామంలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన కేసులో అరెస్టయిన రష్యా జవాను సార్జెంట్ వాదిమ్ షైషిమారిన్ (21)నుకీవ్‌లోని కోర్టుకు తరలించి విచారించారు. తన నేరాన్ని షైషిమారన్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.అతనికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో: జెలెన్‌స్కీ ఆవేదన

ఇదిలా ఉండగా ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ తెలియదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశంనుంచి రష్యన్ సైనికులను తరిమి కొట్టడానికి తమ సైనికులు చేయాల్సినదంతా చేస్తున్నారన్నారు. ‘ ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. మా సైనికులు అత్యున్నతంగా పోరాడుతున్నారు.దురదృష్టవశాత్తు దీని ముగింపు మా ఒకకరిపై ఆధారపడి లేదు. అది మా భాగస్వాములపై ఆధారపడి ఉంటుంది. ఐరోపా దేశాలపై.. మొత్తం స్వేచ్ఛా ప్రపంచంపై ఆధారపడి ఉంది’ అని జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశంలో చెప్పారు. ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News