Monday, December 23, 2024

క్యాన్సర్‌కు రష్యా వ్యాక్సిన్ : పుతిన్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

మాస్కో : క్యాన్సర్‌కి రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటు లోకి తీసుకొస్తామని వివరించారు. మాస్కోలో భవిష్యత్తు టెక్నాలజీలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. “ క్యాన్సర్ వ్యాక్సిన్ , రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నాం.

రాబోయే రోజుల్లో వీటిని చికిత్సల్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నా” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఏ విధమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే అనేక దేశాలు వివిధ రకాలైన క్యాన్సర్ల టీకాలను తయారు చేస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ అనే సంస్థతో క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి పదివేల మంది రోగులకు ఈ వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం పలురకాల క్యాన్సర్ల నివారణకు అవసరమయ్యే ఆరు వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి. భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం దేశంలో 2026 నాటికి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని అంచనా. రష్యా వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే భారత్‌లో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News