Tuesday, November 5, 2024

రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్-19 మరణాలు

- Advertisement -
- Advertisement -

Russia covid deaths
మాస్కో: రష్యాలో శనివారం కరోనా వైరస్ కారణంగా 1002 మంది చనిపోయారు. ఈ మహమ్మారి కారణంగా రోజువారి మరణాలు 1000 దాటడం అన్నది రష్యాలో ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 33208 కేసులు ధృవీకృతం అయ్యాయి. వరుసగా ఐదు రోజులపాటు కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దీనికంతటికీ వ్యాక్సినేషన్ నత్త నడక నడిపించడమే కారణమని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. దాంతో రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖ వ్యాక్సినేషన్ తీసుకున్న రిటైర్డ్ వైద్యులు తిరిగి ఆసుపత్రులకు రావాలని కోరింది.

రష్యా ప్రజల్లో 45 శాతం మంది కొత్త కరోనావైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారని అంచనా. అక్కడి కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ శనివారం దీనికి సంబంధించిన డేటాను ప్రచురించింది. మాస్కోలో దీని సంఖ్య 61 శాతంగానూ, మాస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లో 64 శాతంగా ఉంది.

గత ఏడాది కరోనావైరస్ మొదలవ్వగానే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించింది. కానీ దానిని ఇవ్వడంలో మాత్రం ఆలస్యం చేసింది. రష్యా ప్రజల్లో చాలా మంది అధికారులపై నమ్మకం లేకుండా ఉన్నారు. కొత్త వైద్య ఉత్పత్తుల పట్ల భయాందోళనలతో ఉన్నారు. రష్యా మొత్తం 144 మిలియన్ జనాభాలో కేవలం 48 మిలియన్ జనం మాత్రమే పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కాగా 51 మిలియన్‌ల మంది కేవలం 1 షాట్(డోస్) మాత్రమే తీసుకున్నారు.

రష్యాలో కొత్త కరోనా వైరస్ మరణాలు 222315కు చేరింది. కాగా వ్యాధిగ్రస్తుల మొత్తం కేసులు 7958384కు చేరింది. రష్యాకు చెందిన ‘రష్టాట్ స్టాటిస్టిక్ సర్వీస్’ కరోనా మరణాల గణన వేరుగా ఉంచుతోంది. 2020 ఏప్రిల్ నుంచి 2021 ఆగస్టు వరకు 418000 మరణాలు రికార్డు అయినట్లు ఈ నెల పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News