Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ సిటీలో రష్యా భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

Russia's fierce attacks in Ukraine city

17 మంది పౌరులు దుర్మరణం

కీవ్ : ఉక్రెయిన్‌లోని జపోరిజ్‌జియా నగరంలో రష్యా సైనిక దళాల మెరుపువేగపు భీకర బాంబు దాడులలో కనీసం 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. ఇక్కడి అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్ణీత లక్షాలను ఎంచుకుని ఆదివారం ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఈ ప్రాంతాన్ని రష్యా అధికారికంగా తమ ప్రాంతంగా ప్రకటించుకుంది.అయితే అతి కొద్ది రోజులలోనే తిరిగి ఆ ప్రాంతం ఉక్రెయిన్ కైవసం అయింది. దీనితో ఈ ప్రాంతాన్ని తక్షణం తిరిగి స్వాధీనం చేసుకుని తీరాలని, దేనికీ వెనుకాడేది లేదని రష్యా అధ్యక్షులు పుతిన్ స్పష్టమైన ఆదేశాలు వెలువరించారు.

క్రైమియా బ్రిడ్జిపై దాడుల తరువాత అక్కడ పలు స్థాయిలలో విస్ఫోటనాలు, చమురు ట్యాంకర్ల దగ్ధం వంటి ఘటనల తరువాత ఈ నగరంపై దాడులు జరిగాయి. పలు అంతస్తుల భవనాలను ఎంచుకుని బాంబుల వర్షం కురిపించారు. పలు చోట్ల రాకెట్లు ప్రయోగించారు. దీనితో శనివారం రాత్రి అంతా ఈ నగరంలో భీకరమైన చప్పుళ్లు , పేలుళ్ల దశలో మెరుపులు వంటి ఘటనలు జరిగాయి. పలు అంతస్తుల భవనం రష్యా సేనల దాడులలో దాదాపుగా నేలమట్టం అయింది. గాయపడి, ఏదో విధంగా బయటకు వచ్చిన ఈ అపార్ట్‌మెంట్ నివాసులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వెనుక నిలబడి తమ శిథిలమైన నివాసాలను చూస్తున్నారు. ఈ ప్రాంతంలో రష్యా దాడులలో ఓ చోట 40 అడుగుల లోతైన బిలం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News