Monday, December 23, 2024

మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా నుంచి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సబంధాలను పెంపొందించడానికి కృషి చేసిన ప్రధాని మోడీకి తమ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం అధికారికంగా ప్రదానం చేశారు. క్రెమ్లిన్‌లోని సెయింట్ ఆండ్రూ హాలులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీకి అ పురస్కారాన్ని పుతిన్ అందచేశారు. 2019లో ఈ అవార్డును రష్యా ప్రకటించింది.

ఈ పౌర పురస్కారానికి ఎంపికైన తొలి భారత నాయకుడు నరేంద్ర మోడీ కావడం విశేషం. 1698లో అ వార్డును నెలకొల్పారు. ఏసు క్రీస్తు ముఖ్య శిష్యుడైన సెయింట్ ఆండ్రూ గౌరవార్థం ఈ అవార్డును అపరాజు జార్ పీటర్ ది గ్రేట్ నెలకొల్పారు. కాగా..రష్యా అత్యున్నత పౌర పురస్కారం తనకు లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనను మాత్రమే కాక 140 కోట్ల మంది భారతీయులను గౌరవించడమేనని మోడీ పేర్కొన్నారు. భారత్, రష్యా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రీ బంధానికి, పరస్పర విశ్వాసానికి లభించిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News