ఈ పథకం దేశానికి ఆదర్శం కావాలి, పథకం విజయానికి
తొలి అడుగుగా సిద్దిపేట నుంచి ప్రారంభం
మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ఆనందం: మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ఆరోగ్య పరిరక్షణ కోసమే రుతు ప్రేమ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించిన ‘రుతు ప్రేమ’ అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య పాల్గొని మాట్లాడారు. రసాయ నిక డైపర్, ప్యాడ్స్ వాడడంతో అనేక ఆనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. క్లా త్ ప్యాడ్స్ వాడడంలో సిద్దిపేట యావత్తు ప్రపం చానికే మార్గదర్శకం కావాలన్నారు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి నెలా రుతు స్రావం సహజమన్నారు. రుతు ప్రేమ పేరిట మహిళలకు, పిల్లలకు క్లాత్ ప్యాడ్స్, డైపర్లు పంపిణి చేయడం సిద్దిపేట నుంచే ప్రారంభించుకున్నామన్నారు.
ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రుతు ప్రేమపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులు, ఎఎన్‌ఎం, అంగన్‌వాడిలు, మహిళా సంఘాలపై ఉందన్నారు. క్లాత్ ప్యాడ్స్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు అధిగమించడంతోపాటు డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుందన్నారు. స్వచ్ఛ సిద్దిపేటలో ప్రజలందరూ భాగస్వాములయ్యారని ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలన్నారు. దీనిపై మరింత చర్చ జరిగి రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో క్లాత్ ప్యాడ్స్ వాడేలా అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజులలో సిద్దిపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఉచితంగా క్లాత్ ప్యాడ్స్‌ను పంపిణి చేస్తామన్నారు.
సాధారణ కాన్పులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులకు సూచించారు. సిజేరిన్ అపరేషన్ కారణంగా పుట్టిన పిల్లలతోపాటు తల్లి సైతం ఆనారోగ్యానికి గురవుతుందన్నారు. పాప పుట్టిన గంటలోపే ముర్రు పాలను పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం మహిళలకు రుతు స్రావ కప్పులు, క్లాత్ డైపర్లు, ప్యాడ్స్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ శ్వేత, మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, వైద్యులు శాంతి, రమాదేవి, గాయిత్రి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాధాకృష్ణ శర్మ, కనకరాజు, వినోద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సింలు, సాకి ఆనంద్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.