Wednesday, January 22, 2025

గుండెపోటుతో రుతురాజ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే రుతురాజ్ గుండెపోటుతో చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. రుతురాజ్ తుదిశ్వాస విడిచారని తెలియగానే నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News