అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు రు తురాజ్ గైక్వాడ్ ఏడో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. జిం బాబ్వేతో జరిగిన రెండో టి20లో మెరుపు ఇన్నిం గ్స్ ఆడిన గైక్వాడ్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు రెం డో టి20లో చిరస్మరణీయ సెంచరీ సాధించిన యువ సంచలనం అభిషేక్ శర్మ ఐసిసి ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. అభిషేక్ ప్రస్తుతం 75వ స్థానంలో నిలిచాడు.
ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 821 సూర్య రెండో ర్యాంక్‌లో నిలువగా ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 844 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ మూడు ర్యాంక్‌లు కోల్పోయి పదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కాపాడుకుం ది. భారత్ 268 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రెండో, ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి. వెస్టిండీస్, సౌతాఫ్రికాలు టాప్5లో చోటు సంపాదించాయి.