Monday, April 14, 2025

ఆయన జట్టును విజయాలబాట పట్టిస్తాడు: రుతురాజ్

- Advertisement -
- Advertisement -

చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఈ ఐపిఎల్ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో గెలిచి.. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఆ జట్టులో తాజాగా ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేతికి గాయం కావడంతో అతను ఈ సీజన్‌కి దూరం కావడంతో.. సారథ్య బాధ్యతలను ఎంఎస్ ధోనీకి అప్పగిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్తేజం వచ్చింది.

అయితే తాను జట్టుకు దూరం కావడం.. జట్టుకు ధోనీని కెప్టెన్ చేయడంపై రుతురాజ్ స్పందించాడు. తాను ఈ సీజన్‌కి దూరం కావడం బాధిస్తోందని.. ఇప్పటివరకూ తనకు మద్ధతిచ్చిన ప్రతీ ఒక్కరికి అతడు ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇది మాకు సవాల్‌తో కూడిన సీజన్. మాకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నారు. ఆయన జట్టును ముందుకు తీసుకువెళ్తాడు. మళ్లీ సిఎస్‌కెని విజయాలబాట పట్టిస్తాడు. డగౌట్‌లో ఉంటూనే జట్టుకు మద్ధతు ఇస్తా. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి జట్టు బయటపడాలి. ఈ సీజన్‌ని అంతా కలిసి కట్టుగా ఆడి ఘనంగా ముగించాలి’ అని రుతురాజ్ వీడియో సందేశం ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News