Saturday, January 11, 2025

వేశ్యలను ఇంటికి పిలిపించుకొని హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ సీరియల్ కిల్లర్  వేశ్యలను ఇంటికి పిలిపించుకొని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రువాండా రాజధాని కిగాలీ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే.. అక్కడి పోలీసుల కథనం ప్రకారం..కిగాలీ పట్టణానికి చెందిన 34 ఏళ్ల యువకుడు వేశ్యలను తన ఇంటికి పిలిపించుకున్నాక వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు, డబ్బులు దోచుకొని వారిని హత్య చేసేవాడు.స్థానికుల సమాచారం మేరకు తాజాగా పోలీసులు అతడి ఇంటిలో తవ్వకాలు జరపగా 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News