Thursday, January 23, 2025

క్వార్టర్ ఫైనల్లో రిబాకినా

- Advertisement -
- Advertisement -

అలెక్స్ డె మినార్, లారెంజ్ ముస్టెట్లీ ముందుకు..

లండన్ : రష్యా టెన్నిస్ స్టార్ ఎలెనా రిబాకినా వింబుల్డన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఆమె అన్నా కలిన్‌స్కయా(రష్యా)పై సునయాస విజయాన్ని నమోదు చేసింది. తొలిసెట్‌ను 6-3తో ముగించిన రిబాకినా రెండో సెట్‌లోనూ అఏ జోరు కనబరిచింది. అయితే.. కలిన్‌స్కయాకు అనుకోకుండా మోచేతి గాయమై కోర్టును వదలాల్సి వచ్చింది. దీంతో చైర్ అంపైర్ రిబాకినాను విజేతగా ప్రకటించారు. అయితే క్వార్టర్ ఫైనల్లో ఎలీనా స్విటోలినా(కజకిస్థాన్)ను ఢీ కొట్టనుంది రిబాకినా. ఇక మరో గేమ్‌లో స్వీటోలినా ఎక్స్ వాంగ్‌పై 62 61 ఘన విజయం సాధించగా ఎమ్మా నవర్రో టాప్ సీడ్ కోకొ గాఫ్‌ను మట్టికరిపించింది. 64 63తో వరుస సెట్లతో చిత్తు చేసింది. దీంతో నవర్రో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకుకెళ్లింది. పురుషుల విభాగంలో అలెక్స్ డె మినార్, లారెంజ్ ముస్టెట్లీలు క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు.
రిబాకినా నయా రికార్డు..
వింబుల్డన్ 2024లో అదరగొడుతున్న రిబాకినా అత్యధిక విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ వింబుల్డన్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన ఆమె ఏకంగా 18 మ్యాచ్‌ల్లో నెగ్గింది. దాంతో, మహిళల సింగిల్స్‌లో 90 శాతానికి పైగా విక్టరీ రేటు ఉన్న టెన్నిస్ లెజెండ్స్ అన్ జోన్స్, స్టెఫీ గ్రాఫ్‌ల సరసన చోటు దక్కించుకుంది. 2022 ఛాంపియన్‌గా అవతరించిన రిబాకినా ఈసారి టైటిల్ వేటలో దూసుకెళుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News