Saturday, November 16, 2024

వింబుల్డన్ క్వీన్ రిబకినా

- Advertisement -
- Advertisement -

Rybakina Wins Wimbledon Women’s Singles Title

లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ లో కజకిస్థాన్ యువ సంచలనం, 17వ సీడ్ ఎలెనా రిబకినా మహిళల విభాగంలో టైటిల్ ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో రిబకినా 36, 62, 62 తేడాతో ట్యూనీషియాకు చెందిన మూడో సీడ్ ఓన్స్ జాబేర్‌ను ఓడించింది. ఈ క్రమంలో వింబుల్డ న్ టైటిల్ సాధించిన తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా రిబకినా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి న రిబకినా ఏకంగా టైటిల్‌ను సాధించి నయా చరిత్రను తన పేరిట లిఖి ంచుకుంది. ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో ఓన్స్ ఆధిపత్యం చెలాయించింది. అద్భుత ఆటతో రిబకినాను ఒత్తిడికి గురి చేసిం ది, ఓన్స్ ఆరంభం నుంచే దూకుడును కనబరిచింది. రిబకినా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేక పోయింది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఓన్స్ సఫలమైంది. నిలకడైన ఆటతో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది.

రెండో సెట్‌లో రిబకినా అనూహ్యంగా పుంజుకుంది. అసాధారణ ఆటతో ఓన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన మార్క్ షాట్లతో అలరించిన రిబకినా మ్యాచ్‌పై తిరిగి పట్టుబిగించింది. మరోవైపు ఓన్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. రిబకినా జోరును సమాధానం ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేసింది. ఇక పూర్తి ఆధిపత్యం చెలాయించిన రిబకినా అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అంతేగాక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా రిబకినా జోరును కొనసాగించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడింది. ఆమె ధాటికి ఓన్స్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడిన రిబకినా లక్షం దిశగా సాగిపోయింది. చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది.

రిబకినా ఖాతాలో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. అంతేగాక ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ సాధించి రిబకినా అరుదైన రికాన్డును తన పేరిట లిఖించుకుంది. అంతేగాక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా కూడా రిబకినా నిలిచింది. మరోవైపు భారీ ఆశలతో ఫైనల్ బరిలోకి దిగిన ఓన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తొలి సెట్‌లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఇక మొదటి సెట్‌లో ఓడినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడిన రిబకినా టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News