Sunday, December 22, 2024

ఐటి కట్టేవారికి రైతుబంధు సరికాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారికి, వేల ఎకరాలు ఉన్నవారికి రై తుబంధు ఇవ్వడం స మంజసం కాదని, కేవ లం సాగుచేసే వారికే ఇ వ్వాలని ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తన నివాసంలో బుధవా రం ఆ యన మీడియాతో మాట్లాడుతూ భరోసాకు సంబంధించి విధివిధానాలపై పరిశీలన జ రుగుతోందని, నిజమైన రైతులకే పెట్టుబడి సహా యం చేయాలన్నారు. ధరణి వేదం కాదని, సమస్యల పరిష్కారం చూపేలా ఉండాలని వ్యాఖ్యానించారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి జిల్లా కో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి తో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు తలెత్తి భూయజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ ధరణి పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని, వాటిని సరిచేసే అధికారం రెవెన్యూ యంత్రా ంగానికి ఉందని అన్నారు.

అయితే, విఆర్‌ఓ, విఆర్‌ఎ వ్యవస్థలను తీసివేసి సమస్యల పరిష్కారానికి మార్గం లేకుం డా చేశారని వ్యాఖ్యానించారు. ధరణిలో కాస్తు కాలం లేకపోవడం, ఆస్తి ఎలా వచ్చిందనే వివరాలు లేకపోవడంతో వారసత్వ హక్కును కోల్పో యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. విఆర్‌ఎ, విఆర్‌ఓ వ్యవస్థల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో పాలన లేకుండా పోయిందన్నారు. ధరణితో యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉండగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి యాజమాన్య హక్కులను కాలరాసేవిధంగా ఉందని అన్నారు. ధరణితో గ్రామాల్లో గొడవలు ఎక్కువయ్యాయని, అన్నదమ్ముల మధ్య వారసత్వ ఆస్తుల కోసం కోట్లాటలు జరుగుతున్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News