రైతుబంధు నిధుల జమతో అన్నదాతల్లో ఆనందం
తొలి రోజు 20లక్షల ఖాతాల్లో రూ.586 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో పండగ వాతావరణం నెలకొం ది. ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తుండ గా మరోవైపు వ్యవసాయ కుటుంబాలు రైతు బంధు సంబురాల్లో మునిగితేలుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద మంగళవారం నిధుల పం పిణీ కార్యాక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. వానాకాల పంటల సాగు పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.5000 రైతు ల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ప్రక్రియ ను మొదలు పెట్టింది. తొలిరోజు ఎకరం, ఆలోపు పొలం ఉన్న రైతులకు రూ586. 65కోట్లు పంపిణీ చేసింది. రాష్ట్రంలో 19,98, 285 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసింది. తొలిరోజు మొత్తం 11.73లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. రైతుబంధు పథకం కింద 9వ విడతగా 65లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7508కోట్లు ఈ వానాకాల సీజన్‌లో పం టల సాగు పెట్టుబడులకోసం రూ. 7508 కో ట్లు జమ చేయనుం ది. ఎకరానికి రూ.5000 చొప్పున ఈ నిధులు అందనున్నా యి. మొ త్తం 10రోజుల పా టు జరిగే నిధుల పంపిణీ ప్రక్రియలో రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ నిధు లు జమ చేస్తూ పోనున్నారు.
పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు పథ కం నిధులను పోస్టాఫీస్‌ల ద్వారా కూడా పొందేవిధంగా ఏర్పాట్లు చేశారు. రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రైతుబంధు నిధులను పో స్టాఫీస్‌లలో కూడా డ్రా చేసుకునే విధంగా రాష్ట్రంలోని 4576పోస్టాఫీస్‌లలో ఈ ఏర్పాట్లు చేశారు. 5362మైక్రో ఏటిఎంల ద్వారా రైతులకు సేవలందించనున్నారు. రైతులు తమ సమీప పోస్టాఫీస్‌కు వేళ్లి ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ ,బ్యాంక్ పాస్‌బుక్ తీసుకుని వెళ్లి నగదు డ్రా చేసుకునే విధంగా చర్యలు చేపట్టినట్టు పోస్ట్‌మాస్టర్ జనరల్ వెల్లడించారు. ఈ సేవలన్ని రైతులకు ఉచితంగానే అందించనున్నట్టు తెలిపారు. రోజుకు గరిష్టంగా రూ.10వేలు పొందే ఏర్పాటు చేశారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి విడుదలైన నిధుల్లో రూ.34.58కోట్లు 86,518మంది రైతులకు పోస్టాఫీస్‌ల ద్వారానే అందజేశారు.
రైతుబంధు అమలుచేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ:మంత్రి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయరంగంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి పంటల సాగులో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పధకం కింద నిధుల పంపిణీ ప్రారంభం సందర్బంగా మంగళవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బిజేపి తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ రైతుడిక్లరేషన్ కాగితాలకే పరిమితం అన్నారు. బిజేపి పాలిత 18రాష్ట్రాల్లో , కాంగ్రెస్ అధికారంలో ఉన రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం తరహా వ్యవసాయ అనుకూల పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు జాతీయ విధనాలు ఎందుకు ఉండటం లేదన్నారు. ఆ రెండు పార్టీలకు అధికార కాంక్ష తప్ప తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ బిజేపి పార్టీల పిల్లిమొగ్గలు ప్రజలంతా చూశారన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు జమ అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ణప్తి చేశారు.