Monday, December 23, 2024

ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక తొలిసారిగా రైతుబంధు పధకం కింద 2023-24 యాసంగి సంబంధించి శుక్రవారం వరకు 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇప్పటికే 92.68 శాతం మం ది రైతులకు రైతుబంధు నిధులు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సంవత్సరం రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజులలోనే జమ చేయ డం జరగలేదన్నారు. రైతుబంధు ఆరంభము నుండి చూ సినట్లయితే 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజు లు, యాసంగిలో లో 5 నెలల 11 రోజులు, 2019-20 వానాకాలంలో 4 నెలల 10 రోజులు, యాసంగిలో 1 నెల 19 రోజులు 2020-21 వానాకాలంలో 5 నెలల 16 రోజులు, యాసంగిలో 2 నెలల 24 రోజులు,2022-23 వానాకాలం లో 2 నెలల 8 రోజులు, యాసంగిలో 4 నెలల 28 రోజులు, 2023 -24 వానాకాలం లో 3 నెలల 20 రోజులు పట్టిందని వివరించారు.

ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇచ్చిన మేరకు ఒకే విడతలో రూ. 2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికి రైతుల శ్రేయస్సుకు ఈ రాష్ట్రప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ పురోగతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు.అధికారంలో ఉన్నపుడు ఏనాడు పంట పొలాలని సందర్శించని బిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్సిస్తున్నారన్నారు. గత ప్రభుత్వము పంటలబీమా పథకం అమలు చేసినట్లైతే ఇప్పుడు ప్రతికూల వా తావరణ పరిస్థితులు , గత ప్రభుత్వం అనాలోచిత చర్యల ఫలితంగా ఖాళీ అయిన రిజర్వాయర్ల వల్ల సాగునీరు అం దక అక్కడక్కడ కాల్వ చివర ఆయకట్టులో పంటలు ఎండి పాయినప్పటికీ రైతులను ఆదుకొనే అవకాశం ఉండేదన్నారు.2020, 2021, 2023 సంవత్సరంలో భారీ, అతి భారీ వర్షాల వలన తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ 2023, -2024 సంవత్సరంలో వర్షపాత లోటు ఏర్పడిందని, ఫలితంగా సాగు నీటి రిజర్వాయర్లలో, చెరువులో నిరు తగ్గుతున్నదన్నారు.

భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండిపోతున్నాయని, దీంతో సాగు నిరు అందక కొన్ని జిల్లలలో పంటలు ఎండిపాయిన సందర్భాలు కనిపిస్తున్నాయని వివరించారు.గత ప్రభుత్వనికి భిన్నంగా ప్రస్తుత ప్రభు త్వం వడగండ్ల వర్షాలకు నష్టపాయిన రైతుల వివరాల ను సేకరించే భాద్యత వ్యవసాయ శాఖాకు వేగంగా అప్పగించామని వెల్లడించారు. నష్టపపాయిన రైతులకు ఎకరానికి 10వేల రూపాయల నష్ట పరిహారం అందిస్తామని కూడా ప్రకటించామన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు డు డిజైన్లతో, అవినీతితో నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం లాంటి ఘటనల వల్ల, అవకాశం ఉన్న కొద్ది పాటి నీళ్ళను కూడా గేట్లు లేపి క్రిందకి వదిలేయాల్సి రావడం, కొత్తగ నీళ్ళను ఇప్పుడే లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఏర్పడడం కూడా తెలంగాణా యాసంగి రైతులకు శాపంగా మారిందని వెల్లడించారు. అన్ని పరిస్థితులు బాగుండి, ఒక వేళ కొద్దిగా నీళ్ళను లిఫ్ట్ చేసిన, ఆ నీళ్ళు ఇప్పుడున్న క రువు పరిస్తుతులను మార్చడానికి ఏ మాత్రం పనికి వొచ్చేవి కావన్నది వాస్తవమన్నారు.

వాటిని తప్పకుండ ప్రజల తాగు నీటి అవసరాల కోసమే జాగ్రత్త చేసుకోవాల్సి ఉందని తెలిపారు.నీటి పారుదల రంగంలో, వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాల ఏర్పడినపుడు, పంట లు ఎండిపోయి భారీ వర్షాలకు నష్టపాయినా రైతులు ఇ బ్బందులు ఎదుర్కున్నప్పుడు తమ పరిపాలనా కాలంలో తాము వ్యవరించిన తిరు అంత మర్చిపోయి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా రైతుల పక్షాన మాట్లాడ్తున్నట్లుగా ఫోజు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప ప్రాజెక్టులు గేట్లు తెరిచి నీళ్ళు వధలాలనే డిమాండ్ లో వాళ్ళ నిజాయితి కనపడడం లేదన్నారు. వారి తప్పులని కప్పు పుచుకోవడానికి నిస్సిగ్గుగా గత ప్రభుత్వ నేతలు చేస్తున్న కపట నాటకాల్ని రైతులందరూ గమనిస్తునే ఉన్నారన్నారు. గత ప్రభుత్వములో 2014 రుణమాఫీ లో ప్రకటించిన లక్ష రూపాయలును నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలగా చెల్లించి రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసారన్నారు.

2018 రుణమాఫీని ఎన్నికలు వచ్చినప్పుడల్ల రైతులను మభ్యపెడుతూ 25,000- వరకు అని 50,000 వరకు అని, అదీ ఎన్నికలు జరిగే నియోజికవర్గాలకు ఆ జిల్లాల రైతులకు విడుదల చేయ డం, చివరికి సార్వత్రిక ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్ కుదవ పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రేమే రుణమాఫీ అమలు చేశారని అన్నారు. ఇప్పుడు ఈ ప్రభు త్వం వచ్చాక రైతులకు అన్యాయం జరిగింది అని పెడబొబ్బలు పెడుతూ మొసలి కన్నిరూ కారుస్తూ ఇ ప్పుడు నేలకొన్న దుర్భిక్ష పరిస్థుతలను కూడ రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకే సారి 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి రిజర్వు బ్యాంకు, సం బంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పనకు కసరత్తు జరుపుతున్నదని వెల్లడించారు. ఈ ప్రభుత్వం పండిన ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పిస్తూ ముందు కు సాగుతున్నదన్నారు.

అదేవిదంగా మున్ముందు ఏ ఒక్క రైతు ప్రకృతి వైపరిత్యల వల్ల కానీ వర్షాభావ పరిస్తుతలకు గాని నష్ట పోకూడదని, రైతులు కట్టే ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టడానికి సిద్దపడి, వచ్చే వానాకాలం నుండి పంట భీమ అమలు చేస్తున్న విషయం ద్వార ఈ ప్రభుత్వ చితశుద్దిని గమనించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News